Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

ఠాగూర్
గురువారం, 17 జులై 2025 (13:10 IST)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ వాదనలు వినకుండానే ఎలా బెయిల్ ఇస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వల్లభనేని వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ హైకోర్టు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీశ్ శర్మ, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించింది. 
 
ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. ఇరువురి వాదనలు విని, మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచన చేసింది. 
 
తాము కేసు మెరిట్స్‌తో పాటు పిటీ వారెంట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో తెలిపారు. దీంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments