Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ మృతిపై శశికళపుష్ప పిటిషన్ కొట్టివేత.. చిన్నమ్మే సీఎం కావాలంటోన్న దీపక్..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత డిసెంబర్ ఐదో తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జయమ్మ మృతి అనుమానాలున్నాయని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సుప్రీం కోర్టులో

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (12:00 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత డిసెంబర్ ఐదో తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. జయమ్మ మృతి అనుమానాలున్నాయని, సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శశికళ పుష్ప దాఖలు చేసిన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌పై తీర్పును వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే పార్టీలో ఇంతకాలం శశికళ అనుచరులు చిన్నమ్మ సీఎం కావాలని నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి జయలలిత కుటుంబ సభ్యుల దగ్గర శశికళ సీఎం కావాలని చెప్పిస్తున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన దీపక్ తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ఆంటీ బాధ్యతలు స్వీకరిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
శశికళ అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు స్వీకరించి మా మేనత్త జయలలిత ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారని దీపక్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమిళనాడు సీఎంగా శశికళ ఉండాలని అన్నాడీఎంకే నాయకులతో పాటు తాను కోరుకుంటున్నానని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments