Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకొచ్చి....

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (09:42 IST)
వేసవిలో వచ్చే తుఫానులు అల్లకల్లోలం సృష్టిస్తుంటాయి. ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫణి సోమవారంనాటికి మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై వుంది. ఈ తుఫాను మే 1 సాయంత్రం వరకు ఈశాన్య దిశగా పయనించి ఉత్తరాంధ్ర వైపుకి అతి సమీపంలోకి దూసుకు వస్తుంది.
 
ఈ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో మే 3న భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అంతేకాదు ఒకటిరెండు చోట్ల మే 4న అతి భారీవర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
 
కాగా ఫణి పెనుతుఫాన్ ఉత్తరాంధ్రకు సమీపంలోకి వచ్చి ఆ తర్వాత తన దిశ మార్చుకుని ఒడిషా వైపుకి పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తమ్మీద ఫణి తుఫాను ముప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేనట్టే. ఐతే సముద్రం అల్లకల్లోలంగా వుంటుంది కనుక చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments