Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చ‌ప్ప‌ట్లు కాదు... మోదీ తెలిసో తెలియకో ఒప్పుకున్నారు.. కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి

విజ‌య‌వాడ‌: నేను పార్లమెంటులో చప్పట్లు కొట్టానని వక్రీకరించి మాట్లాడారు... అస‌లు నాకు చప్పట్లు కొట్టవలసిన అవసరం ఏంటి? అని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌న రాజకీయ‌ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే స్పెషల్ స్టేటస్ బిల్లు పెట

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (17:50 IST)
విజ‌య‌వాడ‌: నేను పార్లమెంటులో చప్పట్లు కొట్టానని వక్రీకరించి మాట్లాడారు... అస‌లు నాకు చప్పట్లు కొట్టవలసిన అవసరం ఏంటి? అని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌న రాజకీయ‌ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే స్పెషల్ స్టేటస్ బిల్లు పెట్టింద‌ని, ఆ పార్టీకి చిత్తశుద్ధి లేద‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌లో కేంద్రమంత్రి సుజ‌నా మాట్లాడుతూ, రాజ్య‌స‌భ‌లో తను చ‌ప్ప‌ట్లు కొట్టినందుకు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. 
 
ప్ర‌తిప‌క్షాలు రాజకీయాలు ఆపి హోదా గురించి ప్రయత్నించాల‌ని, చంద్రబాబు చేస్తున్న కృషిని రాజకీయ పార్టీలు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నాయ‌న్నారు. చంద్రబాబు ఆదేశానుసారం నేను కష్టపడుతూనే ఉన్నాను.. స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి వచ్చి తీరాలి. అది ఎన్డీయే బాధ్య‌త‌... ఎన్నికల ముందు ప్రధాని మోడి తెలిసో తెలియకో కోన్ని హామీలు ఇచ్చారు... అని సుజ‌నా వ్యాఖ్య‌నించారు. 
 
స్పెషల్ స్టేటస్ బిల్లు మనీ బిల్లు కింద‌కే వస్తుందని ఆర్ధిక నిపుణులు చెప్పార‌ని, తాను పార్లమెంటులో చప్పట్లు కొట్టానని వక్రీకరించార‌న్నారు. మ‌న్మోహన్ సింగ్ అప్పట్లో బిల్లులో ప్రత్యేక‌ హోదాను చేర్చి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాద‌ని, తాను చప్పట్లు కొట్టిన అంశంపై కాకుండా ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాల‌న్నారు. అయితే... ఇంత‌కీ సుజనా చ‌ప్ప‌ట్లు కొట్టిన‌ట్లు ఒప్పుకున్న‌ట్లేనా? లేదా అనేది మాత్రం స్ప‌ష్టం చేయ‌ట్లేదు. ద‌టీజ్ రాజ‌కీయం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments