Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుపాకీ మిస్‌ఫైర్.. ఎస్ఐ తలలోకి దూసుకెళ్లిన 2 బుల్లెట్లు

తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ తలలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఫలితంగా ఓ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరిలో జరిగింది.

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (12:43 IST)
తుపాకీ మిస్ ఫైర్ అయింది. దీంతో సబ్ ఇన్‌స్పెక్టర్ తలలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఫలితంగా ఓ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరిలో జరిగింది. 
 
కెరమెరి ప్రాంత ఎస్ఐగా కె.శ్రీ‌ధ‌ర్ ‌(27) పని చేస్తున్నారు. ఈయన సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్ కావడంతో ఆయన తలలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్సై శ్రీధర్ మృతి చెందాడు. శ్రీధర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం అవునూరు గ్రామం. ఘటనపై విచారణ జరిపిన జిల్లా ఎస్పీ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
 
మరోవైపు... ఈ ఘ‌ట‌న‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. తుపాకి ప్ర‌మాద‌వశాత్తు పేలిందా? లేక శ్రీ‌ధ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? అనే అంశం ఇంకా తేల‌లేదు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రెండు రోజుల క్రిత‌మే శ్రీ‌ధ‌ర్ కెర‌మెరి ఎస్ఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఎస్ఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రెండు రోజుల‌కే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments