Webdunia - Bharat's app for daily news and videos

Install App

చినబాబుకు సినిమా చూపించిన విద్యార్థులు... (Video)

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పలువురు విద్యార్థులు సినిమా చూపించారు. పలు ప్రశ్నలు సంధించి ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆయన సమాధానం చెప్పలేక ఆవేశం వద్దమ్మా... నెమ్మదిగా ప్రశ

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (17:21 IST)
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు పలువురు విద్యార్థులు సినిమా చూపించారు. పలు ప్రశ్నలు సంధించి ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఆయన సమాధానం చెప్పలేక ఆవేశం వద్దమ్మా... నెమ్మదిగా ప్రశ్న అడుగు అంటూనే సమాధానాలు చెప్పారు. లోకేష్ విదేశాల్లో ఉన్న సమయంలో విదేశీ అమ్మాయిలతో మద్యం సేవించిడం, ప్రత్యేక హోదా, కృష్ణపట్నం ఓడరేవుకు భూములు కోల్పోయి, ఉపాధి లేకపోవడం, ఇలా అన్ని అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు సంధించారు. 
 
అలాగే, ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన అవాక్కయ్యారు. భువనేశ్వరి.. బ్రాహ్మణి వ్యాపారం చేసి సంపాదిస్తుంటే.. మీరు ఖర్చు పెడుతున్నారా? అని ఓ విద్యార్థిని లోకేష్‌ను ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ తాను కూడా ఐదు సంవత్సరాలు హెరిటేజ్‌లో ఉన్నానని, బ్రహ్మిణి వచ్చాక ఆమెకు కంపెనీ పగ్గాలు అప్పజెప్పి తాను రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అయినా ఇదేమీ తమకు కొత్త కాదని 'తొలి నుంచి నాకు... మా నాన్నకు ఖర్చులకు మా అమ్మే డబ్బులు ఇస్తుంది' అని వివరణ ఇచ్చారు. ఇపుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments