Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ స్టిక్కర్ చించేసిన కుక్క - పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (18:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కేసులకు నిరసనగా టీడీపీ నేతలు ఒక కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. "మా నమ్మకం నువ్వే జగన్" అనే స్టిక్కర్‌ వైకాపా నేతలు గోడకు అంటించగా, దాన్ని ఓ శునకం చింపేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు సెటైరికల్‌గా స్పందించారు. జగన్ స్టిక్కర్‍‌ను తొలగించిన కుక్కపై కేసులు పెట్టాలంటూ ఎద్దేవా చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళలు ఓ అడుగు ముందుకేసి స్టిక్కర్ చింపేసి సీఎం జగన్‌ను అవమానించిన కుక్కపై కేసు నమోదు చేసి దాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
విజయవాడ సెంటర్ల నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ నేతృత్వంలోని మహిళలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జగన్ స్టికర్లు చించిన కుక్కపై ఫిర్యాదు చేశారు. స్టిక్కర్ చించుతున్న వీడియోను కూడా వారు పోలీసులకు చూపించారు. 
 
"151 సీట్లు గెలుచుకున్న ప్రియతమ నాయకుడు జగన్‌ను కుక్క కూడా అవమానించడం చాలా బాధాకరమన్నారు. ఆయన గౌరవం ఎక్కడా తగ్గకూడదు. స్టిక్కర్‌ను కుక్క చింపివేయడం జగనన్నకి ఎంత మచ్చ. ఎంత నామోషి. ఇది మళ్లీ రిపీట్ కావొద్దని కుక్కపై ఫిర్యాదు చేశాం. కుక్కను తీసుకురావాలి. వెనుక ఉండి కుక్కతో చించేయించిన వాళ్లను కూడా తీసుకుని రావాలి. కుక్కలే కావొచ్చు.. మనుషులే కావొచ్చు.. కుక్కతో పాటు అలా చేయించిన కుక్కల్ని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టాలని కోరుతున్నాం అని ఆమె మీడియాతో అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments