Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (05:48 IST)
శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు టిటిడి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య దినాల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది.
 
 ఇందులో భాగంగా అక్టోబ‌రు 15, 29వ తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు.

వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
 
 ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ  1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు కేటాయిస్తారు.

కావున భక్తులు ముందుగా వచ్చి టికెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారు.
 
 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను అక్టోబ‌రు 16, 30వ‌ తేదీల్లో బుధ‌వారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments