Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ర్వ‌భూపాల‌ వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో మలయప్ప

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (12:26 IST)
తిరుమ‌ల‌లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారు క‌ల్యాణోత్స‌వ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామి కాళీయమర్ధనుడి అలంకారంలో స‌ర్వ‌భూపాల‌ వాహనంపై దర్శనమిచ్చారు. భ‌క్తుల‌కు క‌నువిందు చేశారు. 
 
 
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
 
 
వాహన సేవల‌లో పెద్ద జీయ‌ర్ స్వామి, చిన్న‌జీయ‌ర్ స్వామి, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, ఎపి హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి, టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి, పోకల అశోక్ కుమార్, ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన సోమ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments