Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య!

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (15:22 IST)
ఏపీలోని అధికార వైకాపా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రవి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నాలుగున్నరేళ్లుగా తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకుంటూ వచ్చిన ఆయన... గత రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి రవి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. రి ఆత్మహత్యకు సంబంధించి వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
కొత్త సంవత్సరంలో అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఏంటి?  
 
మరికొన్ని రోజుల్లో 2023 సంవత్సరం ముగిసి 2024లోకి అడుగుపెట్టనున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా, బ్యాంకింగ్, ఆధార్, ఐటీ తదితర విషయాల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. డిసెంబరు 31వ తేదీతో ఉచితంగా ఆధార్ వివరాలు మార్చుకునేందుకు చివరి తేదీగా ప్రకటించారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త సిమ్ కార్డు కొనుగోలుకు డిజిటల్ కేవైసీ తప్పనిసరి చేశారు. డీమాట్ అకౌంట్ నామినేషన్, బ్యాంకు లాకర్ల రివైజ్డ్ అగ్రిమెంట్‌కు డిసెంబరు 31వ తేదీతో గడువు ముగియనుంది. 
 
అలాగే, డీమాట్ అకౌంట్ హోల్డర్లు జనవరి ఒకటో తేదీ లోపు తమ నామినేషన్ వివరాలు సమర్పించాలి. ఈ రూల్ పాటించని వాళ్లు స్టాక్స్ ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. ఆధార్ కార్డు వివరాల్లో ఉచితంగా మార్పులు చేసుకునేందుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఆ తర్వా చేసుకునే మార్పులకు రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
 
సిమ్ కార్డుల కేవైసీ ధ్రువీకరణ మొత్తం ఇకపై డిజిటల్ రూపంలోనే జరుగుతుంది. ఎటువంటి దరఖాస్తులు నింపాల్సిన అవసరం ఉండదు. కొత్త సిమ్ కొనుగోలు సమయంలో టెలికాం కంపెనీలు కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తాయి. మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ నిబంధన ప్రవేశపెట్టారు.
 
బ్యాంక్ లాకర్లు ఉన్న వారందరూ డిసెంబర్ 31లోపు తమ బ్యాంకులతో రివైజ్డ్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవాలి. లేకపోతే, లాకరు ఫ్రీజ్ చేస్తారు. కొత్త టెలీకమ్యూనికేషన్ బిల్లు ప్రకారం, ఫేక్ సిమ్‌లు కొనుగోలు చేసేవారికి మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు. 2022-23 సంవత్సరానికి చెందిన ఐటీ రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 చివరి తేదీ. ఈలోపు పెనాల్టీతో సహా రిటర్నులు దాఖలు చేయాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments