Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్లను చంపేశారు.. కారణం ఏమైవుంటుంది..?

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:16 IST)
ఆధునిక యుగంలో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. టెక్నాలజీ అరచేతుల్లో వుండటంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో అత్తాకోడళ్లు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని బొందిలీపురంలో నివసించే మెహరున్నీశా (37), ఆమె అత్త జురాబాయ్ 965) గురువారం హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట పనిచేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు లోపలికి చొరబడి వీరిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. మెహరున్నీషా భర్త అబ్దుల్ ఖుదీష్ జిలానీ వ్యాపార నిమిత్తం బయటకెళ్లడం.. పిల్లలు స్కూల్‌కు వెళ్లడంతో.. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరే ఉన్నారు. హత్యానంతరం దుండగులు ఇంటికి తాళం వేసి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
దుండగులకు ఇంటి తాళం ఎలా దొరికి ఉంటుంది?.. లేకపోతే ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారే ఈ హత్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇంటికి తాళం వేసివుండటంతో బాబాయ్ ఇంటి నుంచి డూప్లికేట్ తాళం తీసుకొచ్చిన మెహరున్నీశా కుమారులు జాఫర్‌(15), దిషన్‌(12) షాకయ్యారు. అమ్మ, నాన్నమ్మ హత్యకు గురవడం చూసి కేకలు పెట్టారు. స్థానికులు మెహరున్నీశా భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments