Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీహరికోటలో ఆగని ఆత్మహత్యలు.. నిన్న భర్త.. నేడు భార్య

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (10:57 IST)
శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల్లో ఏకంగా ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా, గత 24 గంటల్లో భార్యాభర్తలు ప్రాణాలు తీసుకున్నారు. సీఐఎస్ఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న 24 గంటల వ్యవధిలోనే ఆయన భార్య ఉరేసుకుంది. 
 
ఎంతో కీలకమైన ప్రయోగ కేంద్రంగా ఉండే శ్రీహరికోట షార్ సెంటరులో తొలుత సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ సీఐ వికాస్ సింగ్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నడు. తన భర్త మృతి వార్త తెలుసుకున్న వికాస్ సింగ్ భార్య  తన అన్నతో కలిసి ముంబై నుంచి శ్రీహరికోటకు వచ్చారు. 
 
భర్త వికాస్ సింగ్ మృతిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. షార్ ప్రాంగణంలోని నర్మద గెస్ట్ హౌస్‌లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. వికాస్ సింగ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలు. అయితే, వికాస్ సింగ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments