Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓన్లీ క్యాష్ పేమెంట్స్ చేస్తేనే అడ్మిషన్... కేర్ ఆస్పత్రి నిర్వాకం.. ఆగిన గుండె

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (16:04 IST)
శ్రీకాకుళం జిల్లా రాజాంలో దారుణం జరిగింది. జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి యజమాన్యం వ్యవహారశైలి కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కేవలం క్యాష్ పేమెంట్స్ చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామంటూ మొండికేశారు. డబ్బుకోసం ఏటీఎంల చుట్టూ మూడు గంటల పాటు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలోనే కరోనా సోకిన మహిళ ప్రాణాలు విడిచింది. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి తీరుపై మండిపడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజాం మండలం పెంట అగ్రహారం చెందిన అంజలి అనే మహిళకు కరోనా వైరస్ సోకింది. ఆమెకు శ్వాస పీల్చడంలో కాస్త ఇబ్బందిగా ఉండటంతో జిల్లాలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆస్పత్రికి బంధువులు తీసుకువచ్చారు. అయితే  క్యాష్ పేమెంట్ చేయకుండా అడ్మిట్ చేసుకోలేమని కేర్ ఆసుపత్రి సిబ్బంది స్పష్టం చేశారు. 
 
ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ పేమెంట్‌ను కూడా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. కేవలం క్యాష్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటామంటూ స్పష్టం చేసింది. దీంతో చేసేదేమీ లేక డబ్బు కోసం బాధితురాలి బంధువులు ఏటీఎంల చుట్టూ 3 గంటలు తిరిగారు. ఇంతలోనే బాధితురాలు అంజలికి ఊపిరి ఆడక పరిస్థితి విషమించడంతో రోడ్డుపైనే మరణించింది. 
 
ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అంటూ ప్రజల ప్రాణాలు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 108కు కాల్ చేసినా స్పందించలేదంటూ ప్రభుత్వంపై కూడా మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments