Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధరలపై త్వరలో ఏపీ సర్కారు కీలక ప్రకటన

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ల ధరల విషయంపై ప్రభుత్వం కీలక జీవోను సిద్ధం చేసింది. దీన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. త్వరలోనే వరుసగా తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలోని 13మంది సభ్యులతో కూడిన కమిటీ తాజాగా సమావేశమైంది. 
 
ఇందులో సినిమా టిక్కెట్లు, థియేటర్‌లో చిరుతిళ్ల ధరలు, భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి టిక్కెట్ ధరలపై చర్చించారు. ఈ భేటీ ముగిసిన తర్వాత పలువురు కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. "అటు ప్రజలు, ఇటు సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టిక్కెట్ ధరలపై ప్రభుత్వానికి ఒక నివేదికను తయారు చేసి సమర్పించనున్నాం. ప్రభుత్వం ఎలాంటి ధరను ఫిక్స్ చేస్తుందో వేచి చూడాల్సివుందన్నారు. 
 
అతి త్వరలోనే ప్రభుత్వం టిక్కెట్ ధరలపై సానుకూ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. టిక్కెట ధరల విషయంపై తెలుగు ఫిలిమ్ చాంబర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రజలు, సినీ పరిశ్రమను సంతృప్తి పరిచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం అని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments