Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటి.. ఏటి ఈ ఫుడ్డేంటి... నీ సంగతేంటి.. యాక్షన్‌లోకి వెళ్లిపోతా.. స్పీకర్ సతీమణి వార్నింగ్

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (15:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ మధ్యాహ్న భోజన అధికారులకు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆముదాలవలస మండలంలోని తొగరాం పంచాయతీ సర్పంచ్‌గా పోటీ ఎన్నికైంది. 
 
ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన వాణిశ్రీ.. ఆ పంచాయతీలోని తమ్మయ్యపేట గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆమెకు స్థానిక సమస్యలను వివరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్ వాణిశ్రీ సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినలేకపోతున్నారని తల్లిదండ్రులు సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. భోజనాన్ని పరిశీలించిన ఆమె వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడారు. 
 
అన్నం దారుణంగా ఉండడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధింత అధికారులకు ఫోన్ చేసి చెడామడా వాయించేశారు. ఇదేమన్నా పిల్లలు తినే అన్నమేనా..? అంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు పలుమార్లు హెచ్చరించానని, ఇక యాక్షన్ లో దిగుతానని స్పష్టం చేశారు. స్పష్టమైన ఆధారాలతో సీఎం జగన్‌ను కలుస్తానని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments