Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయ్: స్పీకర్ కోడెల

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:59 IST)
మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు కమిటీ హాల్‌లో మాత్రమే ఉంటాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. కానీ అసెంబ్లీ లాంజ్‌లో కేవలం సభాపతులు ఫోటోలు మాత్రమే ఉంటాయని కోడెల తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు శాసనసభను కించపరిచేలా తనకు లేఖ రాశారని కోడెల అన్నారు. 
 
రాష్ట్ర విభజనలో భాగంగా కమిటీ హాలు తెలంగాణకు వెళ్లిందని చెప్పారు. అసెంబ్లీ, జనరల్ పర్పస్ కమిటీ అనుమతులు లేకుండా ఎవరి ఫొటోను పెట్టలేమని అన్నారు. గతంలో వైయస్ ఫొటో పెట్టినప్పుడు ఆ నిబంధనను పాటించలేదని చెప్పారు.
 
ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా కేవీపీ తనకు లేఖ రాసి, సభను కించపరిచారని కోడెల వ్యాఖ్యానించారు. కేవీపీ రాసిన లేఖను మీరు సమర్థిస్తారా? అంటూ వైకాపా సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు. వైఎస్సార్ ఫోటో పడిపోయేలా ఉంటే దాన్ని తీసి భద్రపరచమని నేనే చెప్పానని కోడెల అన్నారు. కమిటీ హాలులోనే సీఎం ఫోటోలు పెట్టాలని.. అలా పెట్టాల్సి వస్తే సంవత్సరాల వారీగా అప్పటి సీఎం ఫోటోలు పెట్టాలన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments