Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు గమనిక... ఆ రెండు రోజుల్లో 17 రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (12:30 IST)
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ విన్నపం చేసింది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఏకంగా 17 రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే రైళ్లు ఇందులో ఉన్నాయి. ఏకంగా 17 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడువనున్నాయి. ఆయా రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్‌కేసర్ - చర్లపల్లి స్టషన్ల మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణం పనుల్లో భాగంగా, ఆర్‌యూబీ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. అలాగే, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ రైళ్ల రద్దులో భాగంగా ఆదివారం రద్దు చేసిన రైళ్లను పరిశీలిస్తే, 
 
ఈ నెల 21న (ఆదివారం) వరంగల్ - సికింద్రాబాద్‌ (రైలు నంబర్‌ 07757), సికింద్రాబాద్‌ - వరంగల్‌ (07462), వరంగల్‌ - హైదరాబాద్‌ (07463), హైదరాబాద్‌ - కాజీపేట (07758), కాచిగూడ - మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ - నడికుడి (07277), నడికుడి - మిర్యాలగూడ (07973), మిర్యాలగూడ - కాచిగూడ (07974), సికింద్రాబాద్‌ - రేపల్లె (17645), గుంటూరు - వికారాబాద్‌ (12747), వికారాబాద్‌ - గుంటూరు (12748), హైదరాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17011), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - హైదరాబాద్‌ (17012), సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ (17234), సికింద్రాబాద్‌ - గుంటూరు (17202), గుంటూరు - సికింద్రాబాద్‌ (17201), సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233) రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments