మళ్ళీ సోనూసూద్ ఉదారత, గుండె ఆపరేషన్ చేయిస్తానని హామీ

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (09:42 IST)
ఈ మధ్యకాలంలో కష్టం ఎక్కడ ఉంటే సోనూసూద్ అక్కడే కనిపిస్తున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తేజశ్రీ (12) అమ్మాయికి అండగా ఉంటానని మళ్ళీ సోనూసూద్ గొప్ప ఉదారతను చాటుకున్నాడు.

మొయినాబాద్ మండలంలోని ఎన్కెపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న జేపీఎల్ కన్వెన్షన్లో గత నాలుగు రోజులుగా సోనూసూద్ సినిమా షూటింగ్ సందడి నెలకొంది.

దీంతో నగరంలోని హాఫిజ్‌పెట్‌కు చెందిన మారయ్య సరస్వతి దంపతులు విషయం తెలుసుకొని తన కూతురు తేజశ్రీని వెంటబెట్టుకొని శనివారం ఎన్కెపల్లిలోని జేపీఎల్ కన్వెన్షన్లో సోనూసూద్‌ను కలిశారు.

పుట్టినప్పటి నుండి గుండె సంబంధిత వ్యాధితో తమ కూతురు బాధపడుతుందని అప్పటి నుండి చికిత్స చేయిస్తూ మందులు వాడుతున్నామని అన్నారు.నెలకు 20వేల రూపాయలు మందుల కోసమే వెచ్చిస్తున్నామని ఇప్పుడు మందులు తీసుకోవడానికి డబ్బులు లేవని తమ గోడును సోనూసుదుకు వెలిబుచ్చారు.

దీంతో సోనూసూద్ స్పందించి బాలిక మందుల కోసం అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చాడు. ఒకవేళ బాలిక గుండె మార్పిడి ఆపరేషన్ తప్పనిసరి అయితే వైద్య ఖర్చులు భరిస్తానని గొప్ప ఉదారత మనస్సును చాటుకున్నాడు. దీంతో సోనూసూద్ చూపిన ఆప్యాయతకు తేజశ్రీ తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments