Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఓ ముద్దాయిల పార్టీ.. ఓటుకు నోటు కేసులో బాబు పాత్ర లేదు: సోమిరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిది రైతు కుటుంబం అయితే.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబం అవినీతి కుటుంబం అని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీలో ఉన్నవారంతా ఎమ్మెల్సీ ఎన్నికల

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (15:59 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిది రైతు కుటుంబం అయితే.. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబం అవినీతి కుటుంబం అని టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వైసీపీలో ఉన్నవారంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నారా లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలపై కనీస పరిజ్ఞానం లేకుండా   మాట్లాడుతున్నారని, జగన్‌కు దమ్ముంటే లోకేష్ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 
 
వైసీపీలో ఉన్నవారంతా ఏదో ఓ కేసులో ముద్దాయిలేనని.. అదో ముద్దాయిల పార్టీ అన్నారు. చంద్రబాబు ఎన్నో కేసులు వేసినా ఒక్కటీ నిరూపించలేకపోయారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని, అందుకే ఆయన భయపడే ప్రసక్తే లేదన్నారు.
 
నారా లోకేష్ ఆస్తులపై వైకాపాకు చెందిన సాక్షి దినపత్రిక రాసిన రాతలు, వైసీపీ నేతల నోట నుంచి వచ్చిన మాటల విమర్శలపై సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు జగన్‌కు అంత ఆస్తి ఎక్కడితో చెప్పాలని నిలదీశారు. లోటస్ పాండ్‌ ఇంటిని ఎన్నికల అఫిడవిట్లో చూపించే దమ్ములేని జగన్‌కు లోకేశ్‌ ఆస్తులపై మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
 
దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని విలాసవంతమైన ఆస్తులు జగన్‌కు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌ ఎంతో కష్టపడి తన వారసులకు ఆస్తులు కూడబెట్టారని, వారంతా ఎప్పటి నుంచో ఆదాయపన్ను కడుతున్నారన్నారు. 2004లో ఇళ్లును కూడా అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్‌కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments