Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌కి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్?

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (16:46 IST)
హైదరాబాద్‌కి చెందిన భవ్యశ్రీ చరిత అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గత కొద్ది రోజుల క్రితం అదృశ్యం కాగా, పోలీసులు ఆమెకోసం తీవ్రంగా గాలించడం, ఆ తర్వాత ఆమె తాను సొంతగానే వైజాగ్ వెళ్ళిపోయానని చెప్పడం తెలిసిందే. జనం ఇంకా ఆ సంఘటన గురించి మరచిపోకముందే హైదరాబాద్‌ నగరంలో మరో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యమైంది.
 
బెంగళూర్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ మహిళా స్టాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైంది. అత్తాపూర్ హుడాకాలనీకి చెందిన పి. మోహన్‌రావు కుమార్తె భరణి(26) బెంగళూర్‌లోని ఓ కంపెనీలో కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 
 
అక్టోబర్ 26వ తేదీ రాత్రి 9 గంటలకు భరణిని తండ్రి ఎంజీబీఎస్‌లో బెంగళూరు వెళ్లే బస్సు ఎక్కించి ఇంటికి వెళ్లారు. తర్వాత భరణికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ఛాప్ చేయబడి ఉంది. తర్వాత రోజు ఆయన భరణి పనిచేసే కంపెనీకి ఫోన్ చేసి వాకబు చేయగా ఆమె రాలేదని తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. 
 
దీంతో కుటుంబ సభ్యులు నగరంతో పాటు బంధు, మిత్రుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ దొరకకపోవడంతో గురువారం రాత్రి అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments