Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాముల రక్షణకు జీవితాన్ని అర్పించిన సర్పప్రేమికుడు..

పల్లెటూర్లలోనే కాదు మహానగరాల్లో కూడా పాము మన ఇంటిముందుకో, మైదానంలోకో, రోడ్డుమీదికో వచ్చిందంటే చాలు దాని అంతు చూడకుండా వదలం. భారతంలో పరీక్షిత్తు మహారాజు సర్పయాగం చేసి ఎన్ని సర్పాలను బలి తీసుకున్నాడో లెక్క తెలీదు కానీ భారత్‌లో ప్రతి ఏటా వేల కొద్దీ పాము

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (05:59 IST)
పల్లెటూర్లలోనే కాదు మహానగరాల్లో కూడా పాము మన ఇంటిముందుకో, మైదానంలోకో, రోడ్డుమీదికో వచ్చిందంటే చాలు దాని అంతు చూడకుండా వదలం. భారతంలో పరీక్షిత్తు మహారాజు సర్పయాగం చేసి ఎన్ని సర్పాలను బలి తీసుకున్నాడో లెక్క తెలీదు కానీ భారత్‌లో ప్రతి ఏటా వేల కొద్దీ పాములను అన్యాయంగా చంపేస్తున్నారు. ఏమాత్రం అవగాహన లేకుడా చర్మంతా ఆ జీవి పాక్కుంటూ మనల్ని సమీపించిందంటే చాలు ముందుగా మనం ప్రాణభయానికి గురై దాని ప్రాణం తీసుకుంటున్నాం.

 
 
ఇంటిముందుకు వచ్చిన పామును చంపకండి అంటూ గత ముప్పై ఏళ్లుగా ఒక హైదరాబాదీ సామాన్యుడు సర్పరక్షణ యాగం చేస్తున్నాడు. మొదట్లో నగరంలోని ఒక ప్రాంతంలో కొందరు స్నేహితుల సహాయంతో పాముల రక్షణకు చేపట్టిన తొలి ప్రయత్నాలు ఇవ్వాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపంలో విస్తరించి సర్ప ప్రేమికులను తయారు చేశాయంటే ఆ ఘనత రాజ్‌కుమార్ కనూరికే దక్కుతుంది. 
 
ఈరోడు హైదరాబాద్‌లో సర్ప మిత్రుల సమితి (ఫ్రెండ్స్ ఆప్ స్నేక్స్ సొసైటీ) ఎంతో పేరున్న సంస్థ. ప్రతి రోజూ ఈ సొసైటీకి 200 నుంచి 300 మంది కాల్స్ చేసి తమ ఇంట్లోకి, పరిసరాల్లోకి పాము వచ్చిందని ఫిర్యాదు చేయడం తడవు ఈ సొసైటీ మిత్రులు పరుగెత్తి అక్కడికి చేరుకుని పాములను పట్టుకుని కాపాడటం నిత్య కృత్యంగా మారింది. 
 
దాదాపు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సైనిక్ పురి ఏరియాలో చిన్న ప్రయోగంగా మొదలైన ఈ సర్ప రక్షణ కార్యక్రమం ఇప్పుడు నివాస ప్రాంతాల్లోకి వచ్చిన పాములను పట్టుకోవడం వాటిని అడవీ ప్రాంతాలకు తరలించడం మాత్రమే కాకుండా వందలాది పాఠశాలలు, కాలేజీలు, కంపెనీలకు పాముల గురించి అవగాహన కల్పించడంతోపాటు అడవుల నరికివేతకు వ్యతిరేకంగా అటవీ శాఖతో కలిసి పని చేసే స్థాయికి విస్తరించింది.
 
సొసైటి ప్రస్తుత ముఖ్య కార్యనిర్వాహకుడు అవినాష్ విశ్వనాధన్ మీడియాతో మాట్లాడుతూ 1992-93 నాటికే పాముల గురించి ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న భ్రమలను తొలగించే ప్రయత్నాలు అనేకం చేశామన్నారు. మొదట్లో పాములను కాపాడే తమ కార్యక్రమానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని, తర్వాత నోటి మాటల గుండానే తమ సమితి గురించి ప్రజల్లో వ్యాప్తి చెంది వారు స్వయంగా నివాస ప్రాంతాల్లో కనిపించిన పాము గురించిన సమాచారాన్ని తమకు చెప్పే స్థితికి తీసుకొచ్చామన్నారు.
 
సొసైటీలో 20-30 మంది సభ్యులు చేరేటప్పటికీ వీరి కార్యక్రమాలను మీడియా ఫోకస్ చేయడంతో మాకు పెద్ద ప్రోత్సాహం వచ్చిందని అవినాష్ అన్నారు. ఈ  మహోద్యమానికి కారకుడైన రాజకుమార్ కనూరి 2010లో సెరెబ్రల్ మలేరియాకు గురై అనూహ్యంగా మరణించడం తామందరికీ పిడుగుపాటులా తగిలిందని, పాముల గరించి సంపూర్ణ అవగాహన కలిగిన గొప్ప నేతను మేం కోల్పోయామని చెప్పారు. 
 
కాని రాజకుమార్ ఆశయ స్ఫూర్తితో మేం ఇప్పుడు 70 మంది వాలంటీర్లకు పెరిగి 24 గంటల సర్వీసును  అందిస్తున్నామని, కాల్ వస్తే చాలు వెంటనే పాము కనిపించిన చోటుకు  వెళ్లి దాన్నికాపాడుతున్నామని సమితి కార్యదర్శి అవినాష్ చెప్పారు.
 
గత అక్టోబర్‌లో హైదరాబాద్‌లో బాగా రద్దీగా ఉండే కేబీఆర్ పార్కులో పెద్ద పాము కనపడి అందరినీ భయభ్రాంతులకు గురిచేసినప్పుడు తమ సమితే అక్కడికి వెళ్లి ప్రజల ఆందోళనను తగ్గించిందని అవినాష్ చెప్పారు. గత సంవత్సరం హైదరాబాద్‌లో వరదనీటితో పాటు పాములు ఇళ్లలోకి వచ్చినప్పుడు కాల్ చేస్తే చాలు అంత ప్రమాదకర పరిస్థితిలోనూ వెల్లి పాములను కాపాడామన్నారు. 
 
భారతదేశంలో ఉన్న పాముల్లో చాలావరకు విషరహితమైనవని, కానీ ప్రజల్లో అవగాహనాలోపం వల్ల కనిపించని ప్రతి పామునూ చంపుతుండటంతో పాముల జీవనం దుస్థితిలో పడిందని అవినాష్ చెప్పారు. 
 
పాము కరిస్తే చస్తామంటూ భ్రమలకు గురై పాములను బలితీసుకుంటున్న దారుణాన్ని మాని పాములను కూడా బతకనివ్వండి అంటూ అర్థిస్తున్న ఈ సర్పప్రేమికుల మాట మనమూ విందామా..
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments