Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతూను పెళ్లి చేసుకున్నా.. స్మగ్లింగ్‌తో సంబంధం లేదు: మస్తాన్ వలీ

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:01 IST)
సినీనటి నీతూ అగర్వాల్‌ను పెళ్ళి చేసుకున్నానని హైదరాబాదులో కాపురం చేస్తున్నామని ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసుల అదుపులో ఉన్న మస్తాన్‌ వలీ తెలిపాడు. ఒక సినిమా నిర్మాణ సమయంలో హీరోయిన్ నీతూతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో తాను సినీనటి నీతూ అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. 
 
నీతూకు ఎర్రచందనం అక్రమ రవాణాతో ఎలాంటి సంబంధాలు లేవని వలీ వివరించాడు. గతంలో కమీషన్ల కోసం ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసిన మాట నిజమేనని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాటన్నింటికి దూరంగా ఉంటున్నానని మస్తాన్ తెలిపాడు. 
 
ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు మస్తాన్‌ను అనంతపురం జిల్లాకు తీసుకురాగా, ఆయన మీడియాకు ఈ విషయాలు వివరించాడు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కొందరు ఈ కేసులో ఇరికించారని ఆరోపించాడు. కాగా, ఈ కేసులో నీతూను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments