Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలచెరువుకు చిన్న లీకేజీ, అపాయం లేదు కానీ..?

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (19:28 IST)
గత రెండు రోజుల నుంచి చిత్తూరు జిల్లాలోని రాయలచెరువుకు పడిన గండి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణమైనా చెరువు కట్ట తెగిపోతుందని గ్రామస్తులు ఊర్లకు ఊర్లు ఖాళీ చేశారు. 0.9 టిఎంసి సామర్థ్యం ఉన్న రాయలచెరువులో అధికంగా నీటి సామర్థ్యం ఉండడంతో కట్ట తెగే అవకాశముందన్న ఆందోళన నెలకొంది.

 
దీంతో రాయలచెరువు చుట్టుపక్కల ఉన్న సుమారు 16 గ్రామ ప్రజలను హుటాహుటిన అధికారులు తరలించారు. మూడు వేల మందికి పైగా గ్రామస్తులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే టీటిడి సహకారంతో తిరుచానూరులోని పద్మావతి నిలయం కూడా పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు.

 
ప్రస్తుతం రాయల చెరువు వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న ఇసుక వేసిన తర్వాత గండి ఏమాత్రం పూడకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం సిమెంటు ఇసుక కలిపిన మిశ్రమాన్ని చెరువుకి పడిన గండి వద్ద కూలీలు వేస్తున్నారు.

 
సిమెంటు ఇసుకతో ఉన్న మిశ్రమం గండి దగ్గర వేయడం వల్ల గట్టిగా మారిపోయి నీరు బయటకు వెళ్లే ఉధృతి తగ్గుతుందన్న నమ్మకంతో అధికారులు ఉన్నారు. మూడు వందల మందికి పైగా కూలీలు శ్రమించి ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.

 
ప్రస్తుతానికైతే రాయల చెరువు వద్ద ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోంది. వర్షం పడుతున్న పరిస్థితుల్లో వరద ఉధృతి పెరిగి చెరువు కట్ట ఏ క్షణమైనా తెగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ హిట్.. శివ కార్తీకేయన్‌కు హగ్- కన్నీళ్లు పెట్టుకున్నారు.. (video)

గేమ్ ఛేంజర్ టీజర్.. అన్ ప్రిడిక్టబుల్ అనే డైలాగ్ వైరల్.. ఎందుకు?

మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీ కపూర్ (video)

నాని వదులుకోవడంతో ఆ హీరోలకు లక్క్ వరించింది

మట్కాలో వరుణ్ తేజ్ పై రామ టాకీస్ ర్యాంప్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments