ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష కేసులో ఆమె మేనమాన తీవ్రఆరోపణలు చేశారు. శిరీషన్ ఆమె రాజీవ్, శ్రవణ్ కలిసి మెడకు ఉరి బిగించి చంపేశారని ఆరోపించారు. ఆమెను హత్య చేసేందుకు ముందు వీరంతా ప
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష కేసులో ఆమె మేనమాన తీవ్రఆరోపణలు చేశారు. శిరీషన్ ఆమె రాజీవ్, శ్రవణ్ కలిసి మెడకు ఉరి బిగించి చంపేశారని ఆరోపించారు. ఆమెను హత్య చేసేందుకు ముందు వీరంతా పెనుగులాడారని అందుకు నిదర్శనం శిరీష షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయన్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ తన మేనకోడలిపై తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. తన మేనకోడలిని కారులో తీసుకొచ్చేటప్పుడే హతమార్చారని, మెడకు వైరు బిగించి ఆమెను హత్య చేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె మెడపై వైరు మచ్చలు ఉన్నాయన్నారు.
అంతేకాకుండా మీడియా చూపిస్తున్న ఫోటోలలో ఆమె షర్టు బటన్ గుండీలు అపక్రమంలో పెట్టినట్టున్నాయని, కావాలంటే చూడాలని ఆయన సూచించారు. కింది బటన్‌ను పైబొత్తంలో పెట్టారని, కావాలంటే మీడియా చూపిస్తున్న ఫోటోలలో సరిచూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.