Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్: టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఓ యువతి వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (13:25 IST)
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఓ యువతి వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది. ఈనెల 18వ తేదీన ఈ విషాదకర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
నిజామాబాద్ జిల్లాకు చెందిన సుస్మిత అనే 25 యేళ్ళ యువతి హైదరాబాద్‌లో జరిగిన టెట్ పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షను ఆమె సరిగ్గా రాయలేదు. ఇది ఆమెను బాగా కుంగదీసింది. పైగా ఈ పరీక్షలో పాస్ కాలేనన్న అపనమ్మకం ఆమెలో బలంగా నాటుకుపోయింది. 
 
ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు తిరుగుపయనమైంది. కామారెడ్డి స్టేషన్‌కు ముందు.. ఆ యువతి ప్రయాణిస్తున్న రైలుకు సిగ్నల్ లేకపోవడంతో ఆగింది. అదేసమయంలో మరో ట్రాక్‌పై ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ అమితవేగంతో వస్తోంది. దీన్ని గమనించిన ఆ యువతి.. ఉన్నట్టుండి రైలు దిగి.. వేగంగా వస్తున్న ఇంటర్ సిటీ రైలుకింద పడిపోయింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. 
 
లెవల్ క్రాసింగ్ వద్ద సరదాగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ఓ యువకుడు హఠాత్తుగా ఆమె ట్రైన్ కిందపడటం చూసి షాకై, వీడియో తీశాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు ఈ వీడియో పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments