Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరీషను స్టూడియోకు పరిమితం చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజీవ్?

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. తాజాగా మరో కొత్త విషయం వెల్లడైంది. శిరీషను పనిలో చేర్చుకున్నపుడే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవాలని రాజీవ్ స్పష్టమైన నిర్ణ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (20:28 IST)
హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో కొత్తకోణం వెలుగు చూస్తోంది. తాజాగా మరో కొత్త విషయం వెల్లడైంది. శిరీషను పనిలో చేర్చుకున్నపుడే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవాలని రాజీవ్ స్పష్టమైన నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో శిరీష‌కు ఉద్దేశ్యపూర్వకంగా పని ఒత్తిడి పెంచిన రాజీవ్... ఆమెను రేయింబవుళ్ళు ఆర్జే ఫోటో స్టూడియోకు పరిమితం చేశాడు. అలా ఆమెకు దగ్గరైనట్టు తెలుస్తోంది. 
 
కాగా, సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్‌, శ్రవణ్‌లను మళ్లీ రెండురోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో తాజాగా పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌ను విచారంచిన కోర్టు రాజీవ్‌, శ్రవణ్‌లను పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. ఈనెల 26, 27 తేదీల్లో వీరిని కస్టడీలోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసులు విచారించనున్నారు. 
 
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిరీష బ్యూటీషియన్‌ కోర్సు పూర్తి చేశాక సతీష్‌చంద్రను వివాహం చేసుకుంది. వీరికి 12 సంవత్సరాల కుమార్తె ఉంది. సతీష్‌చంద్ర ఓ స్వచ్ఛంద సంస్థలో కుక్‌గా పనిచేస్తున్నాడు. శిరీష కూడా వివాహాది శుభకార్యాలకు పెళ్లి కుమార్తెల ముస్తాబుకు వెళ్లేది. నాలుగు సంవత్సరాల క్రితం ఆమెకు రాజీవ్‌తో పరిచయమైంది. 
 
ఆమెపై మనసుపడిన రాజీవ్... స్టూడియో చూసుకునేవారు కావాలని చెప్పడంతో శిరీష అతడితో పనిచేసేందుకు అంగీకరించింది. కొద్ది రోజులు అంతా బాగానే సాగింది. మెల్లిగా శిరీషకు పని పెంచుతూ ఎక్కువ సమయం స్టూడియోకే పరిమితం అయ్యేలా చేశాడు. అనంతరం ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments