Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత మార్పిడుల్లో తప్పు లేదు : సామ్నా పత్రికలో శివసేన

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (14:05 IST)
మతమార్పిడులపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చతోపాటు రాద్ధాంతమే జరుగుతోంది. అయితే, శివసేన మాత్రం ఈ మత మార్పిడులను సమర్థిస్తోంది. ఆ పార్టీ తన 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో స్పందించింది. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా, గతంలో చాలామంది హిందువులను ముస్లింలుగా మార్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. 
 
'నిన్నటివరకు, హిందువులను ముస్లింలుగా మార్చారు. అవి ఒత్తిడి ద్వారా లేదా ప్రలోభ పెట్టడం ద్వారా జరిగాయని ఎవరూ అనలేదు. కానీ ఇప్పుడు గంగా నది వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభించగానే ఆ మత మార్పిళ్లు సరికాదని నకిలీ లౌకికవాదులు అంటున్నారు' అని సేన పేర్కొంది. 
 
మొఘల్ కాలంలో హిందువులను ముస్లింలుగా... పోర్చుగీసు, బ్రిటీష్ పరిపాలనలో క్రిస్టియన్లుగా బలవంతపు మార్పిళ్లు చేసిన దానిపై ఈ లౌకికవాదులు ఏం చెబుతారని అడిగింది. ఇది కేవలం బీజేపీ మద్దతుదారులు చేయిస్తున్న మార్పిళ్లుగా కనిపిస్తోందని, దాంతో కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం ఇరకాటంలో పడిందని పేర్కొంది. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments