నా భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవడో తేల్చాల్సిందే... సాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్టుకు రావాల్సిందే!

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (11:18 IST)
తన భార్య అయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవడో తెల్చాల్సిందేనని, ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని శాంతి భర్త మదన్ మోహన్ అంటున్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య ఎలా గర్భందాల్చిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాల్సివుందని విశాఖకు చెందిన మదన్‌ మోహన్ పేర్కొన్నారు. 
 
ఆయన హైదరాబాద్ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూబ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనరుగా పనిచేస్తున్న తన భార్య శాంతికుమారి గర్భందాల్చిన విషయంలో.. ఓ పెద్దాయన ద్వారా ఐవీఎఫ్ జరిగిందని ఒకసారి, పెద్దాయనతో శారీరక సంబంధం ఉందని, ఆయన పేరు విజయసాయిరెడ్డి అని మరోసారి చెప్పినట్లు వెల్లడించారు. 
 
శాంతి ప్రసవం జరిగిన ఆసుపత్రి రికార్డుల్లో భర్త పేరు రాయాల్సిన చోట సుభాష్ రెడ్డి అని ఉందని.. అతడిని సంప్రదిస్తే తనకు ఎలాంటి సంబంధం లేదన్నారని.. ఈ వివాదం తేలాలంటే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సుభాష్ రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిందేనని కోరారు. తనకు విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, కేవలం మాయమాటలు చెప్పి సంతకం చేయించుకున్నారని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments