Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ షబ్బీర్ అలీ ఫైర్: డ్రెస్‌లపై ఉన్న శ్రద్ధ రైతులపై నిల్!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (16:05 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీకి రకరకాల డ్రెస్సులు ధరించడం మీద ఉన్న శ్రద్ధ దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలపై లేదని దుయ్యబట్టారు. 
 
హైదరాబాదులో షబ్బీర్ అలీ మాట్లాడుతూ, విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాలు రాక్ సింగర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. క్షణానికో డ్రెస్సు మారుస్తున్న మోడీ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా విదేశీ పర్యటనకు వెళ్లారా? లేక దేశ ప్రధానిగా వెళ్లారా? అని ఆయన నిలదీశారు. వివిధ దేశాల్లో పర్యటిస్తున్న మోడీ, ఆయా దేశాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇదిలా  ఉంటే.. 'డియర్ బరాక్ ఒబామా ధ్యాంక్స్...మీ మాటలు నన్ను ఎంతో ఉత్సాహపరచాయి' అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఓ పత్రికకు ఆర్టికల్ రాసిన ఒబామా, చాయ్ వాలా స్థాయి నుంచి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎన్నికైన మోడీ  ఆధ్వర్యంలో భారత్ ప్రగతి పథాన పయనిస్తుందని పేర్కొన్నారు. 
 
పేదరికం నుంచి ప్రధాని వరకు మోడీ అనుభవాలు భారత అభివృద్ధిలో ఉపయోగపడతాయని ఒబామా, కొనియాడిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments