Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌క్క సీటులో కూర్చుని... కోర్కె తీర్చ‌మ‌ని వేధిస్తున్నాడు... గుంటూరు ఎస్పీ ఆఫీసులోనే

గుంటూరు : ఆమె ప‌క్క సీటులోనే కూర్చుని కోరిక తీర్చ‌మ‌ని రోజూ వేధిస్తున్నాడు. అదీ ఎక్క‌డో కాదు... గుంటూరు జిల్లాలోని ఎస్పీ ఛాంబర్‌కు అతి సమీపంలో ఉండే కార్యాలయంలోనే ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ లైంగిక వేధింపులకు గురైంది. ఆమె మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (14:08 IST)
గుంటూరు : ఆమె ప‌క్క సీటులోనే కూర్చుని కోరిక తీర్చ‌మ‌ని రోజూ వేధిస్తున్నాడు. అదీ ఎక్క‌డో కాదు... గుంటూరు జిల్లాలోని ఎస్పీ ఛాంబర్‌కు అతి సమీపంలో ఉండే కార్యాలయంలోనే ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ లైంగిక వేధింపులకు గురైంది. ఆమె మనస్తాపంతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం నగరంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలోని పైఅంతస్తులో పరిపాలన విభాగంలో పనిచేసే జూనియర్‌ అసిస్టెంట్‌ మాధవి కార్యాలయంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
కానిస్టేబుల్‌గా పని చేసే ఆమె తండ్రి సాంబయ్య చనిపోవడంతో ఆమెకు పోలీసు కార్యాలయంలో మినిస్టీరియల్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బందికి సంబంధించి హెచ్‌ఆర్‌ఏ బిల్లులను ఆమె చూస్తూ ఉంటారు. బీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌‌గా పనిచేసే కరీముల్లా తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధింపులకు గురి చేశాడు.
 
తన లైంగిక వేధింపులకు లొంగకపోవడంతో ఆమెపై వేధింపులు మరితంగా పెంచాడు. దీంతో చేసేదేమీ లేక బాధితురాలు నేరుగా గత సోమవారం అర్బన్‌ ఎస్పీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేసింది. వేధింపులకు సంబంధించి తన వద్ద ఉన్న ఫోన్‌ రికార్డ్స్‌, సీడీలను సైతం అర్బన్‌ ఎస్పీకి అందించింది. దీంతో ఈ వ్యవహారంపై అర్బన్‌ ఎస్పీ విచారణకు ఆదేశించారు. అయినా క‌రీముల్లా వేధింపులు ఆగ‌క‌పోవ‌డంతో ఆమె ఆత్మ‌హ‌త్య‌ా యత్నానికి పాల్పడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం