Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే వసతి సముదాయం విష్ణునివాసం సమీపంలో వ్యభిచారం...

తిరుపతి పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు, ఆవేశంతో హత్యలు, తితిదే సముదాయాలు, ఆలయాలకు సమీపంలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు ఇలా ఎన్నో పట్టణంలో జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలోని తితిదే సముదాయాలకు అతి సమీపంలో ఉన్

Webdunia
సోమవారం, 16 మే 2016 (12:00 IST)
తిరుపతి పుణ్యక్షేత్రంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు, ఆవేశంతో హత్యలు, తితిదే సముదాయాలు, ఆలయాలకు సమీపంలో వ్యభిచార ముఠా కార్యకలాపాలు ఇలా ఎన్నో పట్టణంలో జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలోని తితిదే సముదాయాలకు అతి సమీపంలో ఉన్న లాడ్జిలలో గత కొన్నిరోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. తొమ్మిదిమందితో కూడిన ముఠా అతి రహస్యంగా ఈ తతంగాన్ని నడిపిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. ఈ ముఠాలో కీలక సభ్యురాలు ఒక మహిళ అని తెలియడంతో నోటిపై వేళ్లేసుకున్నారు పోలీసులు. మిగిలిన ఎనిమిదిమంది పురుషులే. 
 
ఒకే ఒక్క మహిళ గత కొన్ని నెలలుగా శ్రీవారి భక్తులతో పాటు, తిరుపతిలోని స్థానికులతో ఈ వ్యభిచార కూపాన్ని నిర్వహిస్తోంది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువతులను మభ్యపెట్టి వ్యభిచార కూపంలోకి ఈ మహిళ దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉద్యోగం దొరక్కపోవడంతో వేరే మార్గం లేక కొంతమంది యువత ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యభిచార నిర్వాహకురాలు పోలీసుల అదుపులో ఉంది. వ్యభిచార నిర్వాహకురాలు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహిళ సహాయంతోనే వీరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం