Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళా నుంచి తిరిగివస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఏపీ భక్తులు! (Video)

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (12:02 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతుంది. ఇందులో పాల్గొని పుణ్యస్నానం చేసి తిరిగి వస్తున్న ఏడుగురు ఏపీ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
జబల్‌పూర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే పైకి ట్రక్కు రాంగ్ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మినీ బస్సులో చిక్కుకునిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారులని వెల్లడించారు. అయితే, మృతి చెందిన వారి పేరు, ఊరు ఇతర వివరాలు తెలియాల్సివుంది. 
 
గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి 
 
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా శివారు శివారుల్లో ఓ బస్సు వంతెన పైనుంచి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 55 మంది మృత్యువాతపడ్డారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి గ్వాటెమాలా నగరానికి వెళుతుండగా ఓ వంతెనపై పలు వాహనాలు ఢీకొనడేంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపకదళ శాఖ అధికారి ఎడ్విన్ విల్లాగ్రాన్ తెలిపారు. బస్సు 115 అడుగుల లోతులో మురుగునీటి ప్రవాహంలో పడిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments