Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టుకు చేరిన ఆనందయ్య ఆయుర్వేద మందు పంచాయతి

Webdunia
సోమవారం, 24 మే 2021 (20:09 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం మేజర్ పంచాయతీకి చెందిన బోణిగి ఆనందయ్య పంపిణీ చేసే ఆయుర్వేద మందు పంచాయతీ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మందులోని లోగుట్టును తేల్చేందుకు ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ శాఖ రంగంలోకి దిగాయి. అప్పటివరకు మందు పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశించింది. అయితే, ఇపుడు ఈ పంచాయతీ హైకోర్టుకు చేరింది. 
 
ఆనందయ్య నాటు మందుపై ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ విచార‌ణ‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున న్యాయ‌వాది ఈ పిటిష‌న్ వేశారు. 
 
ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని, దాన్ని తీసుకుని చాలామంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే, ప్ర‌భుత్వం ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయ‌డం వ‌ల్ల‌.. అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని పిటిషనర్ హైకోర్టుకు విన్న‌వించారు. దీనిపై విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. 
 
మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై స‌స్పెన్స్ కొనసాగుతోంది. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ ఏపీ శాఖ కమిషనర్ రాములు నాయక్ వెల్లడించారు. మరోవైపు, ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం చేసి అతి త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ ఆయూష్ టీమ్‌ను ఆదేశించారు. అప్ప‌టివ‌ర‌కు మందు పంపిణీని ఆపాల‌ని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments