Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడూ.. పవర్‌స్టారూ... ఇద్దరూ తోడుదొంగలే : కత్తి మహేష్

తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (08:51 IST)
తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోమారు నోరుజారాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తోడుదొంగలేనంటూ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై కత్తి మహేష్ ఓ ట్వీట్ చేశాడు. 
 
విజయవాడ పాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని పరిష్కరించాలని ఇటీవల విజయవాడ పర్యటన సందర్భంగా కోరారు. ఇదే అంశంపై ఆయన మరోమారు చంద్రబాబు సర్కారుకు మంగళవారం లేఖ కూడా రాశారు. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. "మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు" అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ కామెంట్స్ పోస్ట్ చేశాడు. 
 
కాగా, గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మాటలతూటాలు పేల్చుతున్న విషయం తెల్సిందే. దీంతో కత్తికి పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దీంతో కత్తి మహేష్ 'టాక్ ఆఫ్ ది టౌన్‌'గా మారిపోయాడు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసి మరోమారు వార్తలకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments