Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి వందే భారత్.. ప్రయాణ సమయాలు ఇవే...

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (12:34 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ముఖ్యంగా, శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వందే భారత్ రైలును నడుపనుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రాంతాల మధ్య ఈ రైలును నడుపుతారు. మొత్తం 662 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని కేవలం 8.30 గంటల్లోనే చేరుకోనుంది. ఏప్రిల్ 9వ తేదీన తిరుపతి నుంచి, పదో తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరుతుంది. 
 
నిజానికి 8వ తేదీన సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభిస్తారు. కానీ, ఆ రోజున రైలులో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతించరు. ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు అదే రోజు రాత్రి 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఒక్క మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ రైలు ప్రయాణ చార్జీలను రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది. 
 
మరోవైపు, ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ మార్గంలో నల్గొండకు ఉదయం 7.19 గంటలకు గుంటూరు జంక్షన్‌కు ఉదయం 9.45 గంటలకు, ఒంగోలుకు 11.09 గంటలకు నెల్లూరుకు 12.29 గంటలకు చేరుకుంటుంది. 
 
ఈ స్టేషన్ల మధ్యే ఈ రైలు ఆగుతుంది. అయితే, నెల్లూరు - తిరుపతి ప్రాంతాల మధ్య గూడూరు జంక్షన్ ఉంది. దీంతో ఈ రైల్వే స్టేషన్‌లో కూడా వందే భారత్ రైలును ఆపాలని స్థానిక ప్రజలు కోరుతుంటారు. ఎందుకంటే. దూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఈ స్టేషన్‌లో దిగి, ఇక్కడ నుంచి మరో రైలులో వెళుతుంటారు. ఇలాంటివారితో స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ రైలును గూడూరు జంక్షన్‌లో ఆపాలని వారు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments