Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో రోజూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలు

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (19:38 IST)
గురువారం రెండో రోజూ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనాలు జరిగాయి. ఆన్‌లైన్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకుని భక్తులు దర్శనానికి వస్తున్నారు.

క్యూలైన్లలో భక్తులు భౌతిక​ దూరం పాటించేలా ఆరు అడుగుల మార్కింగ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. 
 
ఉదయం ఆరు గంటల నుంచి దర్శనాలు ప్రారంభం కాగా, సాయంత్రం 5 గంటల వరకే అమ్మవారి దర్శనం కొనసాగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంద్రకీల్రాదీపై అధికారులు పకడ్బందీ జాగ్రత్త చర్యలు చేపట్టారు.

దర్శనానికి గంటకు 250 మంది భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. శానిటైజ్‌ చేసి చేతులు శుభ్రం చేసుకుని, మాస్క్‌ ధరిస్తేనే భక్తులకు అనుమతిస్తున్నారు.

థర్మల్‌ స్క్రీనింగ్‌ లో టెంపరేచర్ ఎక్కువ వస్తే అనుమతులు ఇవ్వడం లేదు. శఠగోపురం, తీర్థ ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు రద్దు చేశారు. అంతరాలయ దర్శనం నిలిపివేశారు.

ముఖ మండపం ద్వారానే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. మహా మండపం వద్ద మరో ఆన్ లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. కరోనా దృష్ట్యా అన్ని అర్జిత సేవలకు అనుమతి ఇవ్వడం లేదు.

ఘాట్ రోడ్డు మార్గం ద్వారా భక్తులకు అనుమతిలేదని, వృద్ధులు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశం లేదని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments