Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర తుఫానుగా మారిన మాండూస్ - నేడు అతి భారీ వర్షాలు

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (09:21 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. దీని కారణంగాణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. 
 
గడిచిన 6 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ప్రయాణిస్తుందని, ప్రస్తుతం ఇది జాఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, కారైక్కాల్‌కు 240 కిలోమీటర్లు, చెన్నైకు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని తెలిపారు. 
 
ఇది వచ్చే ఆరు గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి శ్రీహరికోటల మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
 
తీరందాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం కారణంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments