Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్లకు భారీగా శ్రీవారి లడ్డూల పంపిణీ ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (14:46 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాలైన ఆకర్షణీయమైన ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ప్రలోభాలు ఎక్కువగా చిత్తూరు జిల్లాలో సాగుతున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఓటర్లను ఆకట్టు కునేందుకు కొందరు నగదు, ఆభరణాలు పంపిణీ చేస్తుండగా మరి కొందరు దేవుడి ప్రసాదం ఆశ చూపి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి  తనకు ఓటు వేసి గెలిపించాలంటూ గ్రామస్థులకు తిరుమల లడ్డూలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. 
 
శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు అవస్థలు పడుతుంటే.. తొండవాడలో ఓటు కోసం శ్రీవారి లడ్డూలను పంచడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి అడ్డు కట్టవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినా.. కిందిస్థాయి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 
 
లో ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వ వాహనంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పంచుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments