Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికెళ్లి తిరిగిరాదనీ.. ప్రియురాలిని కడతేర్చిన ప్రేమోన్మాది

తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ హబీబ్‌నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్త

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (19:41 IST)
తన ప్రియురాలు సంక్రాంతి పండుగకు ఇంటికెళ్లితే ఇక తిరికిరాదనీ భావించిన ఓ ప్రేమోన్మాది ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ హబీబ్‌నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా రాజం మండలం వలస గ్రామానికి చెందిన బోను జానకి (24), గొరెండి గ్రామానికి చెందిన బొడ్డెపల్లి రూప (27) అనే ఇద్దరు యువతులు మూసాపేట్‌లోని శక్తి నగర్‌లో నివాసముంటున్నారు. జానకి, రూప ఇద్దరూ డీమార్ట్‌లో సేల్స్ గర్ల్స్‌గా పని చేస్తూ ఇంటికి ఆసరాగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో అదేప్రాంతానికి చెందిన అనంతప్ప అనే యువకుడు జానకిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని చెప్పగా జానకి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనంతప్ప.. తన ప్రేమను అంగీకరించకపోతే జానకిని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఇటీవలే బెదిరించాడు. 
 
ఈనేపథ్యంలో మంగళవార రాత్రి జానకి రూంకి వెళ్లిన అనంతప్ప.. మాట్లాడాలని కబురెట్టడంతో ఆమె బయటకు వచ్చింది. గది నుంచి బయటకు రాగానే విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపాడు. ఇంతలోనే రూప తన విధులు ముగించుకుని రూం వద్దకు వచ్చి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టురాలైంది. 
 
ఆ తర్వాత తేరుకుని జానకిని చికిత్స నిమిత్తం శక్తి నగర్‌లోని వసుంధర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే జానకి చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments