Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారూ.. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి.. లేదంటే: శబరి

Webdunia
శనివారం, 21 మార్చి 2020 (12:30 IST)
వైకాపా సర్కారుపై బీజేపీ నేత, బైరెడ్డి శబరి రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తప్పును ఎత్తి చూపితే వైసీపీ నేతను తనను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు సమాచారం వస్తే.. వైద్యురాలిగా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత తనకుందని.. పారాసిటమాలే ట్రీట్‌మెంట్ అని సీఎం చెబుతున్నారు. అది జ్వరాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఈ కరోనా వైరస్‌ అంటే జ్వరం మాత్రమే కాదు. వేరే ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఇదే విషయాన్ని చాలా మర్యాదగా చెప్పాను. తాను ఇలా ముందుకొచ్చి చెప్పడం తప్పా అంటూ ప్రశ్నించారు. 
 
ఆరు గంటలకొకసారి 650 గ్రాముల చొప్పున అంటే 24 గంటల్లో దాదాపు 2.5 కేజీల పారాసిటమాల్ వేసుకోవాలి. ఇదేమైనా స్వీటా? మంచిది కాదు. పెద్ద స్థాయిలో ఉన్న మీలాంటి వారు చెబితే.. ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఇంతవరకు తాను రాజకీయం చేయలేదు. ప్రజల కోసం మాట్లాడటానికి ముందుకు వచ్చానని బైరెడ్డి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. 
 
వైసీపీ నేతల బెదిరింపులను ప్రస్తావిస్తూ.. ''చెప్పులతో కొడతామని బెదిరిస్తారా... మీ పార్టీలో ఉన్న వాళ్ల ఇళ్లలో కూడా స్త్రీలు ఉన్నారు. ఒక మహిళ గురించి అలా మాట్లాడకూడదన్నది తెలియదా.. ఇలాంటి రౌడీలకు పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటుందని ఫైర్ అయ్యారు. తనకే ఇంత బెదిరింపులు వస్తుంటే... సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సీఎం జగన్ గారూ.. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. లేదంటే బీజేపీ నేతగా నేనే స్వయంగా యాక్షన్ తీసుకోవలసి ఉంటుంది'' అంటూ ఘాటుగా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments