Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ తాగించి.. ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారం.. ఎక్కడ?

స్నేహితుడైన ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అంతే ఆమె భార్య, కుటుంబం పట్ల సానుభూతిని చూపాల్సిందిపోయి.. మరో ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చెంగిచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (14:47 IST)
స్నేహితుడైన ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. అంతే ఆమె భార్య, కుటుంబం పట్ల సానుభూతిని చూపాల్సిందిపోయి.. మరో ఆర్టీసీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన చెంగిచర్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్‌కు చెందిన శ్యాంసుందర్ రెడ్డి జీడిమెట్ల డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. 
 
ఈ నేపథ్యంలో తన కుటుంబాన్ని పోషించేందుకు ఉపాధి చూపాలని అతని భార్య ఆర్టీసీ అధికారులను కోరింది. ఈ క్రమంలో చెంగిచర్ల డిపోలో డ్రైవర్‌గా, డీపో టీఎంయూ కార్యదర్శిగా పనిచేస్తున్న సోమసాయిలు పరిచయం అయ్యాడు. యూనియన్ నాయకుడు కావడంతో న్యాయం చేస్తాడని నమ్మిన ఆమెకు అతనితో బాగా స్నేహం కుదిరింది. 
 
అధికారులతో మాట్లాడి ఉద్యోగం వచ్చేలా చేస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, ఖాళీ చెక్కులు, ప్రామీసరీ నోట్లు తీసుకున్నాడు. ఒక రోజు ఉద్యోగం వచ్చిందని చెప్పి... పార్టీ ఇవ్వాలని కోరాడు. సాయిలు మాటలు నమ్మిన ఆమె ఆనందంగా ఇంట్లోనే పార్టీ ఇచ్చింది.
 
పీకల దాకా మద్యం తాగిన అతను ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. మత్తులోకి జారుకున్న తర్వాత అత్యాచారానికి పాల్పడటంతో పాటు పలుమార్లు బెదిరించి తనను లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సోమసాయిలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments