Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సులకు టీడీపీ - టీఆర్ఎస్ పార్టీల రంగులు : పసుపు.. గులాబీ..

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (07:34 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల రంగులు మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని బస్సులను ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ జెండా రంగు గులాబీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరిగే బస్సులకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ రంగు పసుపును వేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలను కూడా పంపింది. 
 
అలాగే, తెలంగాణలో 'పల్లెవెలుగు' బస్సుల పేరును 'గ్రామరథం'గా, ఏపీలో 'తెలుగు వెలుగు'గా మార్చనున్నారు. ఇంద్ర బస్సులను తెలంగాణలో రాజధానిగా, ఏపీలో 'నగర వారధి'గా మార్చాలని యోచిస్తోంది. బస్సులకు కొత్త రంగులద్దేందుకు సిద్ధమయింది. ఏపీలోని బస్సులకు 20 శాతం పసుపు రంగు, తెలంగాణలోని బస్సులకు 20 శాతం గులాబీ రంగు వేయాలని నిర్ణయించింది. ఈ రెండు రంగులూ, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల రంగులు కావడం గమనార్హం.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments