పిఠాపురంలో రూ.17 కోట్ల విలువ చేసే బంగారు స్వాధీనం!!

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (09:43 IST)
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన బిల్లు లేకుండా, రవాణా చేసే వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా బంగారం, వెండి వస్తువులను తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్‌టీ అధికారుల బృందం పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే... శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్ఎస్టీ బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖపట్టణం నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన  వాహనం వారికి కనిపించింది. వెంటనే తనిఖీలు చేపట్టగా అందులో బంగారు, వెండి వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. వాటికి సరైన ధృవపత్రాలు చూపకపోవడం, తరలించే వ్యక్తుల పేర్లూ పత్రాల్లో నమోదు చేయకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసి పిఠాపురం తాహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. పంచానామా అనంతరం సీజ్ చేసిన ఖజానా కార్యాలయానికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం