Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం: ఏపీ సీఎం

Webdunia
బుధవారం, 12 మే 2021 (21:13 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించందుకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంబించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,882.23 కోట్లు రైతు భరోసా సాయం అందించనున్నారు. 
 
కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. 
 
ఇది మూడు విడతలుగా ఇవ్వనున్న ప్రభుత్వం. మొదటి విడతలో ఖరీఫ్‌ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెలలో ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతలో ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ, జనవరి నెలలో రూ. 2,000 జమ చేయనుంది.
 
కరోనా నేపధ్యంలో ఖరీఫ్‌ సాగుకు సన్నద్దమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కింద మొదటి విడత సాయంగా నేడు అందిస్తున్న రూ. 3,882.23 కోట్లతో పాటు మే నెలలోనే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద మరో రూ. 2,000 కోట్లలను ప్రభుత్వం అందిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments