రౌడీ షీటర్ బోరుగడ్డకు ఠాణాలో వీఐపీ ట్రీట్మెంట్ - భయ్యా టీ అంటూ ఆర్డర్ వేయగానే...

ఠాగూర్
సోమవారం, 18 నవంబరు 2024 (10:56 IST)
రౌడీ షీటర్‌ బోరుగడ్డ అనిల్‌కు పోలీస్ స్టేషన్‌లో వీఐపీ ట్రీట్మెంట్‌ ఇచ్చారు. భయ్యా టీ అంటూ బోరుగడ్డ అనగానే ఓ కానిస్టేబుల్ టీ తెచ్చివ్వడం వీడియోలో కనిపిస్తుంది. ఇటీవల పోలీస్ స్టేషన్ బల్లపై అనిల్ హాయిగా నిద్రిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతడికి దిండు, దుప్పటి ఇచ్చి మర్యాదలు చేసిన పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అర్థరాత్రి వేళ ఓ బాలుడు పోలీస్ స్టేషనులో ఉన్న బోరుగడ్డను కలిసేందుకు వచ్చి ఆయన పక్కనే కూర్చుని ముచ్చటించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
 
తాజాగా, మరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో బోరుగడ్డ 'భయ్యా ఒక టీ' అని ఆర్డర్ వేయడం.. ఆ వెంటనే కానిస్టేబుల్ ఒకరు టీ తెచ్చి ఇవ్వడం, ఇంకో కానిస్టేబుల్ ఆయనతో కాసేపు ముచ్చటించడం ఆ వీడియోలో రికార్డయింది. అదేసమయంలో మరో నిందితుడు పోలీస్ స్టేషనులో కింద కూర్చుకోవడం ఆ వీడియోలో కనిపించింది. వీడియో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఓ సాధారణ ఖైదీని కింద కూర్చోబెట్టిన పోలీసులు, రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను మాత్రం కుర్చీలో కూర్చోబెట్టి, అతడు అడిగిన వెంటనే టీ తీసుకొచ్చి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగి ఉంటుందని, కానిస్టేబుళ్లపై మాత్రమే చర్యలు తీసుకుని వదిలేయకుండా అధికారులపైనా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments