Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారు: రోజా ఫైర్

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (15:48 IST)
కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తొలుత కోడలు బ్రాహ్మణిని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ హాజరయ్యే పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పంపారని.. వైకాపా నేత రోజా అన్నారు. తర్వాత చంద్రబాబు కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా డైరెక్టుగా రాహుల్‌తో చేతులు కలిపారన్నారు. 
 
టీడీపీ-కాంగ్రెస్ పొత్తు చూసి ఏపీ ప్రజలు చీదరించుకుంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీని చంద్రబాబు తెలుగు దాల్ పప్పుగా మార్చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై గుంటూరులో చెప్పులు వేయించిన చంద్రబాబు, ఇటీవల ఢిల్లీలో ఆయన చెప్పులను తలపై పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
 
నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ వ్యవహారంపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శివాజీ చెప్పినవి చెప్పినట్లు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సీఎంపై దాడి జరుగుతుందని కూడా శివాజీ చెప్పాడన్నారు. అలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా.. ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు దున్నపోతు నుంచి పాలు పితుకుతున్నారా? అని ప్రశ్నించారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకుని ఆపరేషన్ గరుడపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments