చిట్టి పప్పు, ఏంటి రెచ్చిపోతున్నావ్? లోకేష్ పైన రోజా సంచలన వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (23:34 IST)
తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ పైన తనదైన శైలిలో స్పందిస్తూ తీవ్రవిమర్సలు చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. అధికార-ప్రతిపక్షపార్టీల మధ్య గత రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో విమర్సలు, ప్రతివిమర్సలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న విషయం తెలిసిందే.
 
నిన్న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు టిడిపి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. బంద్ జరగనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. టిడిపి బంద్ ప్రభావం ఏమాత్రం లేదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఐతే టిడిపి అధినేత చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అంటూ వైసిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహాల ముందు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు.
 
తన సొంత నియోజకవర్గం పుత్తూరులోని పున్నమి సర్కిల్లో ఉన్న వైఎస్ ఆర్ విగ్రహం వద్ద రోజా నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పైన తీవ్రవ్యాఖ్యలు చేశారు. చిట్టి పప్పు అంటూ సంబోధించారు. ఏమీ తెలియని లోకేష్ కూడా విమర్సలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
 
అన్నీ తప్పులు మాట్లాడుతూ ఒక సబ్జెక్టుపై కనీస అవగాహన లేని వ్యక్తి లోకేష్ అంటూ మండిపడ్డారు. అలాగే చంద్రబాబుపైనా విమర్సలు చేశారు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని.. పార్టీకే సరిగ్గా న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు రోజా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments