Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ‌రాయి వ‌చ్చి ఇంటిపై ప‌డి... కూలీ బ‌తుకు ఛిద్రం!

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (15:58 IST)
కొండ‌ప‌ల్లిలోని పుట్లమ్మ గట్టు వద్ద కొండ చరియలు విరిగి పడి ఒక ఇల్లు ధ్వంసం అయింది. ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. అస‌లే పని లేక ప‌స్తులు ఉండే పరిస్థితులతో కిట్టుమిట్టాడుతున్న కుంటుంబాన్ని, కొండ రాళ్లు వచ్చి మీద పడి చిద్రం చేశాయి. దీంతో కుటుంబ సభ్యులు ఒకరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే మరొకరు ఇంటి వద్దనే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. 
 
కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఉన్న పుట్లమ్మగట్టు ప్రాంతంలో ఉండడానికి ఇల్లు కూడా లేక కొండ పైబాగాన చిన్న రేకుల షెడ్డు గవర్రాజు దేవి అనే మహిళ జీవిస్తొంది. భర్త లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో పాటు ముసలివాడైన తన తండ్రిని పోషించుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.

కూలి పనులు చేసుకుని జీవనం సాగించే దేవికి ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు అగ్ని పరీక్ష పెట్టాయి. ఒక ప‌క్క భారీ వర్షాల కారణంగా పనులు లేక పస్తులు ఉండాల్సిన దుస్థితిలో కుటుంబం అవస్థలు పడుతుండగా, అది చాలదు అన్నట్లుగా  తెల్లవారుజామున కొండచరియలు విరిగి సుమారు రెండు టన్నుల బరువు ఉన్న పెద్ద సైజు బండరాయి ఇంటికి వెనుక వైపున ఉన్న గోడను నెట్టుకుని ఇంటిలోకి వచ్చి పడింది.

జరిగిన దుర్ఘటతో విస్తుపోయిన దుర్గ హాహాకారాలతో పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి దుర్గ తండ్రిని, కుమార్తె భవానిని శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. అయితే నిద్రలో ఉన్న వారిపై ఇంటి గోడలు, నాపరాళ్లు పడడంతో బలమైన గాయాలయినట్లు తెలుస్తుంది.

దుర్గ తండ్రి ముఖంపైన బలమైన గాయం కావడంతో అతడికి పళ్లు ఊడిపోవడంతో పాటు దవడ ఎముక కు బలంగా గాయమంది. మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుర్గ కుమార్తె భవానికి ఎడమ చేతి బుజానికి గాయం కావడంతో ఆమెకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించినట్లు దుర్గ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments