Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ప్యాకెట్ కోసం వెళ్తే కొమ్మ వచ్చి విరిగిపడింది.. రోడ్డు దాటుతుంటే కారొచ్చి ఢీకొంది.. ఇద్దరు బాలురు మృతి

విజయవాడ, చీరాలలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ సత్యనారాయణపురంలో మంగళవారం ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు తన సైకిల్‌పై వెళుతున్న 12 ఏళ్ల బాలుడు హర

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (12:57 IST)
విజయవాడ, చీరాలలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ సత్యనారాయణపురంలో మంగళవారం ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు తన సైకిల్‌పై వెళుతున్న 12 ఏళ్ల బాలుడు హర్షపై ఓ చెట్టు విరిగిపడింది. దాని కొమ్మలు బాలుడి గొంతులోకి గుచ్చుకుపోవడంతో.. ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన శిశువిద్యామందిర్ వద్ద జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించినా, అప్పటికే బాలుడి ప్రాణాలు పోయాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని వారు విమర్శిస్తున్నారు. 
 
అలాగే ప్ర‌కాశం జిల్లా చీరాల బైపాస్ వాడ‌రేవు జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండ‌గా వేగంగా వ‌చ్చిన కారు ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కారు ఢీకొన్న ఈ ఘటనలో కొండేటి యానాదిరావు అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments