Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ - బాబులు తెలుగును ఉద్ధరిస్తారా? రోజా ప్రశ్న

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సర్కారు వచ్చే యేడాది నుంచి ఇంగ్లీషు మీడియం చదువులను ప్రారంభించనుంది. ఈ విధానాన్ని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు.. జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీజేపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిపై ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పందించారు. తెదేపా నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు.
 
ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చుగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. 
 
ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు 'తెలుగు'ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే 'తెలుగు చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచమంతా ఇంగ్లీషు చుట్టూనే తిరుగుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments